ఆశ చూపి.. రూ. 34 లక్షలు దోచి సైబర్ క్రైం బారిన మార్కాపురంలో బ్యాంకు ఉద్యోగి – పోలీసులకు ఫిర్యాదు

ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి సైబర్ క్రైంకు గురై రూ. 34 లక్షలు పోగొట్టుకున్నారు. విడతల వారీగా నెలన్నర వ్యవధిలోనే రూ.34 లక్షలు మోసపోయింది. మార్కాపురం పట్టణ ఎస్సై అబ్దుల్ రెహమాన్ తెలిపిన వివరాల మేరకు.. మార్కాపురం పట్టణం లోని యూనియన్ బ్యాంకులో పని చేసే ఓ ఉద్యోగిని తనకు పేస్ బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తులు ఆన్లైన్ ట్రేడింగ్ యాప్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని, అనేక మంది కస్టమర్లకు అధిక లాభాలు వచ్చాయని చెప్పి బ్యాంకు ఉద్యోగిని నమ్మించారు. నెలన్నర వ్యవధిలోనే విడతల వారీగా తన ఫోన్పే యూపీఐ విధానంలో రూ.34 లక్షలు పెట్టుబడి పెట్టి నట్లు ఎస్సై తెలిపారు. షేర్ మార్కెట్లో నుంచి తన డబ్బులను రీఫండ్ చేసుకోవడానికి ఆన్లైన్ ట్రేడింగ్లో రాకపోవడంతో పాటు, అవతల వ్యక్తుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మోస పోయినట్లు గుర్తించిన ఉద్యోగిని శుక్ర వారం రాత్రి మార్కాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి న్నట్లు ఎస్సై తెలిపారు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *