కురిచేడు మండలం బోదనంపాడు లో శుక్రవారం జరిగిన ఘర్షణ లో 108 పైలెట్ ఆబిద్ వలి తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించినా ఫలితం లేక పోవడంతో మరలా అక్కడి నుండి మంగళగిరి తరలించినట్లు తెలుస్తోంది. తెల్లవారు జామున ఆబిద్ వలి మృతి చెందారు. ఆబిద్ వలి మృతి చెందడం పట్ల 108 పైలెట్లు, ఈయన్టీ లు నల్ల రిబ్బన్ లతో విధులకు హాజరయ్యారు.
