వ్యవసాయ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదల -దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపాల్ & హెడ్ డా॥ పి. సంధ్యారాణిజూన్ 20 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే వ్యవసాయ డిప్లొమా కొర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపాల్ & హెడ్ డా॥ పి. సంధ్యారాణి శనివారం తెలిపారు. ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకొనుటకు 10 వ తరగతి పాస్ అయినవారుతో పాటు ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు 2023 ఆగస్టు 31 వ తేది నాటికి 15 నుండి 22 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలన్నారు. 2002 ఆగస్టు 31 వ తేది నుండి 2009 ఆగస్టు 31 వ తేది లోపు జన్మించి ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంగ్లీషు చదివిన వారికి మున్సిపాటిటీలలో చదివిన వారికి 75÷25 నిష్పతి లో సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. ఆన్ లైన్ లో www.angrau.ac.in అనే వెబ్సైట్లో జూన్ 1 వ తేది నుండి జూన్ 20 వ తేది వరకు దరఖాస్తులు స్వీకరించబడును. స్థానికులకు ఎవరికైనా సందేహలు ఉంటే స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం, దర్శి, వ్యవసాయ పాలిటెక్నిక్, దర్శి, లో సంప్రదించవల సిందిగా తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *