తెలంగాణా ప్రత్యెక రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లుపూర్తి అవుతున్న సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్ అమర వీరుల స్తూపం వద్ద తెలంగాణా తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యం లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గౌరీ శంకర్ యాదవ్ మాట్లాడుతూ… తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించిన పదేళ్ళ కాలంలో రాష్ట్రం లో నిర్బంధ పాలన సాగిందన్నారు. సికింద్రబాద్ లో మొట్టమొదటి అమర వీరుల స్తూపం ఇదే అన్నారు. గత ప్రభుత్వం అమర వీరుల కుటుంబాలను విస్మరించిందని, ఈ ప్రభుత్వం అయినా తెలంగాణా ఉద్యమం లో అమరులైన కుటుంబాలను గుర్తించి వారి కుటుంబాలకు ఉద్యోగాలివ్వలని ఆయన డిమాండ్ చేశారు.అలాగే ప్రతి ఏడాది అమర వీరుల స్థూపం వద్ద పూలతో నిండుగా అలంకరణ చేయాలని,కళాకారుల బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు.సికింద్రబాద్ అమర వీరుల స్తూపం తో పాటు ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చి దిద్దలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సాయిబాబా,తెలంగాణా తెలుగుదేశం పార్టీ సెక్రటరీ రాజు(నల్లగుట్ట),,ఎస్ కే బాబు,నాందేవ్ దేశం,నరసింగరావు,వినోద్ కుమార్,సతీష్,నరహరి,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
