రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలోనీ పార్క్ లైన్ చౌరస్తాలో ఆదివారం మధ్యాహ్నం ఉన్నట్లుండి ఒక చెట్టు రోడ్ మీద కూలిపోయింది.ఈ ఘటన తో ఫట్ పాత్ పక్కనే వ్యాపారాలు నిర్వహించుకునే చిరు వ్యాపారులు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు.దీంతో ఈ మార్గం లో వాహనాలు వెళ్ళే మార్గం మూసుకు పోయింది.ఇదే సమయం లో చెట్టు కొమ్మలు తగిలి ఒక వీధి లైట్ స్తంభం కూడా మరో పక్కకు ఒరిగి పోయింది.దీంతో అక్కడికి వచ్చిన వాహనదారులు వెళ్ళే మార్గం లేక వెనుదిరిగి వెళ్లి చుట్టూ తిరిగి వెళ్ళారు.చెట్టు కూలిపోయిన విషయం తెల్సుకున్న బేగంపేట ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ సాలె రంగారావు మహంకాళీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉపా శంకర్ ను అప్రమత్తం చేయడం తో వెంటనే ట్రాఫిక్ క్రేన్ తో అక్కడికి చేరుకుని చెట్టును తొలగించే ప్రయత్నం చేసారు.భారీ చెట్టు కావడం తో వెంటనే డీ ఆర్ ఎఫ్ సిబ్బందిని రంగం లోకి దింపి చెట్టు కొమ్మల ను మిషన్ సహాయం తో కట్ చేశారు పడిపోయిన చెట్టు కొమ్మలను తొలగించిన సుమారు 45నిమిషాల తరువాత ఆ మార్గం లో ట్రాఫిక్ యధా విధిగా నడిచింది.సకాలంలో స్పందించిన అధికారులకు వాహనదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.

