తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తరలి వెళ్ళిన కాంగ్రెస్ నేతలు -తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నే…షేక్ గౌస్.

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని,కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గాంధీ చొరవ తోనే ఎన్నో ఏళ్ల తెలంగాణా కల సాకారమైందని అన్నారు.తెలంగాణా ప్రజలు సోనియా ను ఎప్పటికీ మరచి పోరని సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఏ బ్లాక్ అధ్యక్షుడు,మాజీ కంటెస్టడ్ కార్పొరేటర్ షేక్ గౌస్ అన్నారు.ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సనత్ నగర్ నియోజక వర్గం బేగం పేట నుంచి షేక్ గౌస్ ఆధ్వర్యం లో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళుతుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర గీతాన్ని అవిష్కరించుకోవడం సంతోషకరమన్నారు. ఈ ఏడాది తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం భారీ ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు.పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలి వెళ్ళిన వారిలో మహమ్మద్ అశ్లామ్,అజీజ్, అయూబ్,ఫిరోజ్,పాషా,శ్రీను తదితరులు వున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *