చేపమందు పంపిణీకి పూర్తి సహకారం – మనీష్ అగర్వాల్

జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తిని కుటుంబ సభ్యులచే చేపమందు పంపిణీ కార్యక్రమానికి అగర్వాల్ సమాజ్ తరఫున పూర్తి సహకారం ఉంటుందని అగర్వాల్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు మనీష్ అగర్వాల్ హామీ ఇచ్చారు ఆదివారం సికింద్రాబాద్ పారడైజ్ వద్ద గల అగర్వాల్ సమాజ్ బంకెట్ హాల్ లో వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో అధ్యక్షులు మనీష్ అగర్వాల్ మాట్లాడుతూ చేప మందు పంపిణీ కార్యక్రమంలో అగర్వాల్ సమాజ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. చేప మందు పంపిణీ జరిగే రెండు రోజులు పాటు చేప మందు స్వీకరణ స్వీకరించడానికి వచ్చే ప్రజలకు భోజన సదుపాయాలను కల్పిస్తున్నట్లు, సమాజ్ కు చెందిన 85 శాఖల నుండి 400 మంది వాలంటీర్లు ఇందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. దేశం నలుమూల నుండి వచ్చే ప్రజల కోసం రైల్వే స్టేషన్ ల నుండి బస్ స్టేషన్ల నుండి పికప్, డ్రాప్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో ముందుగా అగ్ర సేన్ మహారాజ్ పూజలు నిర్వహించారు. అనంతరం గౌరవ కార్యదర్శి కపూర్ చంద్ గుప్తా అగర్వాల్ సమాజం గత సంవత్సర కాలంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు. కోశాధికారి నవీన్ అగర్వాల్ సమాజం యొక్క ఆర్థిక లావాదేవీలు గురించి సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా దేశంలో జరిగే ఎన్నికలలో ఓటింగ్ శాతాన్ని పెంచాలనే సదుద్దేశంతో అగర్వాల్ సమాజం నిర్వహించే ఓట్ కరో కార్యక్రమంలో భాగంగా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో డ్రా ద్వారా ఆరుగురిని ఎన్నుకొని వారికి పది గ్రాముల వెండి డాలర్ ను ప్రోత్సాహక బహుమతిగా సత్కరించారు. సమావేశంలో పాల్గొన్న భత్తిని కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. సమావేశంలో ఉపాధ్యక్షులు పురుషోత్తం అగర్వాల్, సంయుక్త కార్యదర్శి కంచన్ అగర్వాల్, ఇంట్రీమ్ పాస్ట్ ప్రెసిడెంట్ అంజనీ కుమార్ అగర్వాల్, హాల్ చైర్మన్ రాకేష్ అగర్వాల్, పౌర సంబంధాల అధికారి అజయ్ కుమార్ అగర్వాల్ లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 85 శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *