ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 1998-99 సంవత్సరం పదవ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు దాదాపు 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని సంతోషంగా గడిపారు. ఇక్కడ చదవిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి దేశ, విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. నాడు తమకు విద్యాబుద్దులు నేర్పిన గురువులను సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధులు ch హనుమ ప్రసాద్, SV సుబ్బారెడ్డి, రమణయ్య, చాంద్ బాషా,స్థానిక హైస్కూల్ తెలుగు మాస్టారు కృష్ణ మూర్తి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చాంద్ బాషా మాస్టర్ మాట్లాడుతూ 25 సంవత్సరాల తరువాత తమను పిలిచి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం, ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగు మాస్టర్ తిరుపతయ్య మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణతో పేద విద్యార్థులకు విద్యాబోధన అందించడం తమ బాధ్యతగా భావించామని తెలిపారు. ఇదే విధంగా గత 30 సంవత్సరాలుగా చదువుకున్న విద్యార్జులందరికీ తమవంతుగా గురువులను గౌరవించి కృతాజ్థాభివందనములు తెలియజేసే బాధ్యత ఉందన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు Y. బ్రహ్మారెడ్డి, N.వెంకటరెడ్డి, CH.రవీంద్ర, CH. పవన్ కుమార్, అబ్బాస్, అనిల్ కుమార్,తదితరులు గురువులను దుశ్శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అప్పటి విద్యా బుద్దులు నేర్పిన గురువు లతో 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించు కోవడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.




