కొత్తపాలెంలో చోరీ – ఆరుబయట నిద్రిస్తుండగా చోరీ – బీరువా పగులు కొట్టి ఏడు సవర్ల బంగారం అపహరణం- పరిశీలించిన ఎస్సై వైవి రమణయ్య, క్లూస్, ఫింగర్ ప్రింట్ ప్రత్యేక బృందాలు

తాళ్లూరు మండంలోని కొత్తపాలెం గ్రామంలో శనివారం రాత్రి -చోరీ జరిగింది. గ్రామానికి చెందిన కోట సుబ్బారెడ్డి ఇంట్లోకి దుండగులు ప్రవే- శించి బీరువా తాళాలు పగులకొట్టి అందులోని సుమారు ఏడు సవర్ల బంగారు ఆభరణాలను అపహరించారు. ఈ మేరకు యజమాని కోట సుబ్బారెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై వైవీ రమణయ్య గ్రామానికి వెళ్లి దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. క్లూస్ టీం , ఫింగర్ప్రింట్ టీంలు రంగంలోకి దిగి వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *