గుంటి గంగ ఆలయంలో ఘనంగా సుహాసిని పూజ

జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం గుంటిగంగాభవాని అమ్మవారి ఆల -యంలో ఏకాదశి ఆదివారం 108 మంది ముత్తైదు వులతో అత్యంత భక్తిశ్రద్ధలతో సుహాసిని పూజా -కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుహాసిని పూజా కార్యక్రమం సందర్భంగా ఆలయ పూజారులు కామేశ్వరరావు, ప్రకాశరావు, బాలరాజులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ పూజ వలన సకల సౌభాగ్యాలు కలిగి ఆయురా రోగ్యాలతో విరాజిల్లాలని దీవించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కార్తీక్ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం , అరిగే కోట శ్రీనివాసరావు కార్యక్ర మాలకు తగిన ఏర్పాట్లు చేయించారు. సిఐ రామకోటయ్య అమ్మవారిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *