కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఏజెంట్లు తమ సహకారం అందించాలని వైఎస్సార్ హింసాత్మక సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు. మంగళవారం కౌంటింగ్ సందర్భంగా ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ..కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి పూర్తయ్యే వరకు లెక్కింపు పైనే దృష్టి పెట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఏవైనా సందే హాలు ఉంటే అక్కడ అధికారులకు తెలియజేయాలన్నారు.
సలహాలు సందే హాలకు ఎన్నికల అధికారులతో మాట్లాడి అనుమా నాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో గొడవలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటిస్తూ ఎన్నికల కమిషన్ , పోలీసులకు సహకరించాలని కోరారు.
