తాళ్లూరు మండలంలో 144వ సెక్షన్ అమలు – ఎస్సై వైవీ రమణయ్య – జూన్ 3 నుండి 5వరకు 144 సెక్షన్ అమలు

ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో జూన్ 3 నుండి 5 వరకు తాళ్లూరు మండలంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్సై వైవీ రమణయ్య తెలిపారు. నిత్యావరసర సర్వీసులు తప్ప మిగిలిన వాటిపై ఆంక్షలు ఉన్నట్లు చెప్పారు. మధ్యం దుకాణాలు మూసి వేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా టపాసులు పేల్చటం, ఎక్కువ మంది గుమికూడటం చేయకూడదని అన్నారు. అన్ని గ్రామాలలో ప్రజలు ప్రశాంతంగా ఉండేటట్లు ఆయా రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *