జగన్ పార్టీ ఓటమికి కారణాలు ఏంటి?*

వైఎస్ ఆర్ సిపి అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు. కేవలం 10 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఆయన పార్టీ అభ్యర్థులను గెలిపించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ 151 సీట్లు గెలిచింది. ఈసారి టీడీపీ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. వైనాట్ 175 అనే నినాదంతో బరిలోకి దిగిన వైఎస్ఆర్సీపీకి ఇది ఊహించని ఎదురు దెబ్బ.

జగన్ పరాజయానికి 5 కారణాలివే… 1. జగన్ స్వయంకృతం వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయానికి పార్టీ అధినేత వైఎస్ జగన్ వైఖరే కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం లోనైనా, పార్టీలోనైనా తాను అనుకున్నదే జగన్ చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో కలిపి 81 మంది అభ్యర్ధులను మార్చారు. తనకు అత్యంత సన్నిహి తులుగా పేరున్న కాపు రామచంద్రారెడ్డిలాంటి వాళ్లను కూడా జగన్ పక్కనపెట్టారు.

జగన్ తీరుతో అసంతృప్తికి గురైన కొందరు నాయకులు పార్టీని వీడారు. ఈ పరిణా మాలు వైసీపీకి ప్రతికూ లంగా పని చేశాయనే అభిప్రాయాలు వినిపి స్తున్నాయి.

వైసీపీలో టికెట్ రాని కొలుసు పార్థసారథి – నూజివీడు, బాలశౌరి, మచిలీ పట్నం వంటి వారు తెలుగుదేశం, జనసేన పార్టీలలో చేరి గెలిచారు. “ఏకపక్ష నిర్ణయాలు, నెగెటివ్ పాలిటిక్స్ చేయడం ఆయన ఓటమికి ప్రధాన కారణాలు” అని విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *