కూటమి సునామీ లోను డాక్టర్ బూచేపల్లి విజయబావుటా-వైఎస్ఆర్సిపి కి బాసటగా నిలిచిన తాళ్లూరు మండలం లో 3517 ఓట్ల ఆధిక్యం- డాక్టర్ బూచేపల్లి కి అభినందనలు తెలిపిన ప్రజా ప్రతినిధులు , నాయకులు కార్యకర్తలు

రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఊహించని విజయం చేసుకున్నా….దర్శిలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూటమి సునామీలో సైతం విజయం సాధించి సత్తా చాటారు. డాక్టర్ బూచేపల్లి. శివ ప్రసాద్ రెడ్డి తండ్రి 2004లో కాంగ్రెస్ హవాలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది రాష్ట్రంలోనే చరిత్ర సష్టించారు. – 2024లో కూడా టిడిపి కూటమి సునామీలో డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 2456 ఓట్లతో ఘన విజయం సాధించారు. మొదట్లో 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండోసారి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా శివ ప్రసాద్ రెడ్డి మొదటగా గెలిచారు. తర్వాత 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్వల్ప మెజార్టీతో ఓటమి చెందారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయకుండా మద్దిశెట్టి వేణుగోపాల్ కి మద్దతు ప్రకటించి అత్య ధిక మెజార్టీకి గెలుపునకు దోహదం చేశారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పని చేస్తూ 2024లో జనవరిలో 1 రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జిగావైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుండి బూచేపల్లి కుటుంబం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరిని కలిసి ఓట్లు ఆభ్యర్థించారు. మాతృమూర్తి బూచేపల్లి వెంకాయమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు.
దర్శి నియోజక వర్గంలో అభివృద్ధి సేవా కార్యక్రమాలు ముమ్మరం చేశారు.
జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ కూడా సొంత నిధులతో అభివద్ధి పనులు చేశారు. బూచేపల్లి కుటుంబం చేసిన సేవా కార్యక్రమాలు వారికి విజయాన్ని తెచ్చి పెట్టాయి.కౌంటింగ్ లో డాక్టర్ బూచేపల్లి 1,01,849 ఓట్లు రాగా, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీకి 99,433 ఓట్లు వచ్చాయి. దీంతో డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 2456 ఓట్లతో గెలిచినట్టుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించి డిక్లరేషన్ ఫారాన్ని బూచేపల్లికి అందజేశారు.
మండలాలవారీగా ఆయా అభ్యర్థులకు వచ్చిన మెజార్టీలు ఇలా ఉన్నాయి….

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దొనకొండ మండలంలో 719 ఓట్లు, దర్శి రూరల్ లో 293 ఓట్లు, తాళ్లూరు మండలంలో 3517 ఓట్లు మెజార్టీ రాగా, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి కురిచేడు మండలంలో1114, దర్శి మున్సిపాలిటీలో 722 ఓట్లు, ముండ్లమూరు మండలంలో ఓట్లు 96, పోస్టల్ బ్యాలెట్లో141 ఓట్లు మెజార్టీలు వచ్చాయి. దీంతో డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి2456 ఓట్ల ఆధిక్యం తో విజయాన్ని కైవసం చేసుకున్నారు.
డాక్టర్ బూచేపల్లి కి అభినందనలు తెలిపిన ప్రజాప్రతినిధులు నాయకులు..
ప్రతిష్టాత్మక విజయాన్ని కైవసం చేసుకున్న డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డిని నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో కలిసి అభినందనలు తెలిపారు. పలువురు నాయకులు, కార్యకర్తలు మహిళలు డాక్టర్ శివప్రసాద్ రెడ్డిని పలకరిస్తూ భావోద్వేగానికి గురైనారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *