ఈనెల 8 వ తేదిన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఉన్నందున రావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ను బత్తిన సోదరులు ఆహ్వానించారు .
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కి సంబంధించిన ఏర్పాట్ల ను సందర్శిస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.



