బేగంపేట లో ఓ నిర్మాణ సంస్థ బరితెగించింది.రాత్రికి రాత్రే ఓ అపార్ట్మెంట్ గోడ ను కూల్చి తమ స్థలం లోకి ఆ మార్గం ద్వారా రాకపోకలు సాగించే ప్రయత్నం చేసింది.ఇది గమనించిన అపార్ట్మెంట్ వాసులు కాంగ్రెస్ నాయకులు ప్రతిఘటించడం తో తోక ముడిచి కూల్చిన ప్రహరి గోడను నిర్మించేందుకు అంగీకరించింది.బేగంపేట్ ప్రధాన రోడ్ ను అనుకొని నిర్మాణాన్ని సాగిస్తున్న ఓ నిర్మాణ సంస్థ తమ వాహనాల రాక పోకలు సాగించేందుకు వారీ స్థలం వెనుక వైపున వున్న కుందన్ టవర్స్ అపార్ట్మెంట్ ప్రహరీని కూలగొట్టింది.ఇది గుర్తించిన అపార్ట్మెంట్ వాసులు కాంగ్రెస్ నాయకులు గౌరపల్లి రమేష్,పద్మారెడ్డి తదితరులకు సమస్యను వివరించారు.స్పందించిన కాంగ్రెస్ నాయకులు రమేష్,పద్మా రెడ్డిలు వెంటనే సదరు నిర్మాణ సంస్థ తో చర్చించారు.గోడ కూల్చి ఆల్లంతోట బాయి బస్తీ నుంచి వాహనాల రాకపోకలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించడం తో పాటు బస్తీ వైపు నుంచి వాహనాల రాకపోకలు సాగిస్తే తలెత్తే ఇబ్బందులను వారికి వివరించారు.దీంతో సదరు నిర్మాణ సంస్థ తాము కూల్చివేసిన ప్రహరీ నిర్మాణాన్ని చేసి ఇస్తామని చెప్పారు.వెంటనే నిర్మించాలని కాంగ్రెస్ నాయకులు కోరడంతో పాటు గోడ నిర్మాణం పూర్తి అయ్యే వరకు అక్కడే వుండి గోడ కట్టించారు.ప్రహరీ కూల్చిన విషయం లో వెంటనే స్పందించిన కాంగ్రెస్ నాయకులు గౌర పల్లి రమేష్,పద్మారెడ్డీ,సాంబయ్య,శ్రీకాంత్,సత్యనారాయణ,విజయ్ తదితరులకు అపార్ట్ మెంట్ వాసులు.కృతజ్ఞతలు తెలియజేశారు.


