కార్యకర్తలకు అండగా ఉంటా: డాక్టర్ బూచేపల్లి

దర్శి నియోజకవర్గంలో వైసిపి కార్యకర్తలకు అండగా ఉంటానని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం దర్శిలోని పొదిలి రోడ్లో గల వైసిపి కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…. తనకు విజయాన్ని అందించేందుకు గా కృషి చేసిన కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రాకపోయినప్పటికీ తాను 20 సంవత్సరాలుగా తన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా, తన తల్లి జిల్లా పరిషత్ చైర్మన్ గా సేవలందించారని, వాటితో పాటు తమ ట్రస్టు ద్వారా అందించిన సేవలకు గుర్తుగా ప్రజలందరూ తమను ఆదరించి గెలిపించారని అన్నారు. అందుకు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి దర్శికి వచ్చిన డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలను దర్శి నియోజకవర్గంలోని వైసిపి అభిమానులు పెద్దఎత్తున సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఐదు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *