అంతర్జాతీయ స్థాయిలో 140 దేశాల్లో అమ్ముకునేందుకు అవసరమైన ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్ ను ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలము లోని శివ రామపురం నువ్వులు దక్కించుకున్నాయి. తాళ్లూరు మండలంలోని శివరామపురం గ్రామా నికి చెందిన 15 మంది రైతులు పండిం చిన 150 క్వింటాళ్ల నువ్వులను యురేకా ఎనలిటికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారు పరీక్షించి మంచి ఉత్పత్తులుగా నిర్ధారించారు. గ్లోబల్ మార్కెటింగ్ చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీక రణ సంస్థ ఆమోదం పొంది స్కోప్ సర్టిఫి కెట్ ఇచ్చారు. నువ్వుల పంట సాగులో భాగంగా శివరామపురంలో ఎంపిక చేసిన రైతులు గత ఏడాది రబీ పంట కాలంలో 14 వారాల పాటు విత్తనం నుంచి విక్రయం వరకు మేలైన సాగు పద్ద తులు పాటించారు. ఉత్పత్తులకు విలువ జోడించారు. ఎకరాకు సాగు ఖర్చు 12 వేలు కాగా, ప్రతి రైతుకు సగటున రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు దిగుబడి వచ్చిందని తాళ్లూరు మండల -వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు తెలి – వివరించారు. శనివారం ఒంగోలులోని కలెక్టర్ చాంబర్లో వ్యవసాయ శాఖ జిడిఏ శ్రీనివాసరావు తో పాటు ప్రసాదరావుతో పాటు ప్రకృతి వ్యవసాయ డీపీఎం సుభాషిణి, వ్యవ సాయశాఖ అధికారులు శశికళ, శ్రీనివాసనాయక్, వీఏఏలు రాజశేఖరరెడ్డి, రైతులు శివపార్వతి, అనిత తదితరులు కలెక్టర్ దినేష్ కుమార్ కలిశారు. వీరందరినీ కలెక్టర్ అభినందించారు. పొలం బడి మేలైన వ్యవసాయ సాగు పద్ధతులతో – తాళ్లూరు మండలరైతులు నువ్వులు పండించిన విధానం అభినంద నీయమని కలెక్టర్ అన్నారు.

