మాతాజీ నగర్ ఎఫ్ టి ఎల్ స్థలం లో అక్రమ నిర్మాణాలు -రూటు మార్చి మజీద్ నిర్మాణం చేసిన అక్రమార్కులు.ఎన్ని సార్లు కూల్చిన మళ్ళీ మళ్ళీ నిర్మాణాలు -మజీద్ నిర్మాణం చేయడంపై మాతాజీ నగర్ బస్తీ వాసులు,బిజెపి నేతల ఆగ్రహం -కలెక్టర్,నార్త్ జోన్ అడిషనల్ డీ సీ పీ ,జీ హెచ్ ఎమ్ సీ జోనల్ కమిషనర్ ,బేగంపేట్ పోలీసులకు పిర్యాదు చేసిన బీ జే పి నేతలు,బస్తీ వాసులు – మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం.ఉన్నతాది కారులు జోక్యం చేసుకొని అక్రమ నిర్మాణాలు కూల్చకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తానంటున్న బీ జె పీ నేతలు.

బేగంపేట మాతాజీ నగర్ లో మరోసారి ఎఫ్ టి ఎల్ లో అక్రమ నిర్మాణాలు వెలీసాయి …ఈ సారి అక్రమార్కులు రూటు మార్చి మజీద్ నిర్మాణం చేసి మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేసారు.మాతాజీ నగర్ బస్తీ కి అనుకుని సర్వే నంబర్ 194/8/1లో 10ఎకరాల 20 గుంటల స్థలం వుంది .ఇది ఎఫ్ టి ఎల్ ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ ఈ స్థలం లో ఎలాంటి నిర్మాణాలు చేపట్ట రాదంటూ గతం లో పలుమార్లు జీ హెచ్ ఎం సి టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక్కడ నిర్మించిన నిర్మాణాలను నేలమట్టం చేశారు.2023 డిసెంబర్ 29 న అధికారులు ఇక్కడ నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారు.2024 మార్చి 23న కూడా ఇక్కడి నిర్మాణాలను కూల్చివేశారు.అయితే ఈ తరుణం లో రూటు మార్చిన కొందరు ఇక్కడ ఒక మజీద్ నిర్మాణం చేశారు.దీంతో మాతాజీ నగర్ బస్తీ వాసులు,బీ జె పీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇది కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అని,ఇది ప్రశాంతం గా వున్న ప్రాంతం లో మత విద్వేషాలకు తావిస్తుందని,వెంటనే మజీద్ ను తొలగించాలని కోరుతూ సోమవారం బస్తీ కమిటీ అధ్యక్షులు నరేష్,బీ జే పి నేతలు నెమలి ఆనంద్ నేతృత్వంలో డివిజన్ అధ్యక్షుడు గోవింద్,మైసూర్ మదు,శ్రావణ్ కుమార్,సందీప్ వర్మ,లక్ష్మణ్,కృష్ణ,లక్ష్మీనారాయణ,చంద్రకళ,సునీతా,శోభ,మంగ,ఉషా,సాయిలు,గంగారం,దేవిక పెద్ద ఎత్తున బస్తీ వాసులు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్ళి లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు.నార్త్ జోన్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ పీ.అశోక్ ,సికింద్రబాద్ జీ హెచ్ ఎమ్ సి జోనల్ కమీషనర్ రవి కిరణ్,బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఎస్సై జయచంద్ర కు లిఖిత పూర్వకముగా పిర్యాదు చేశారు.అధికారులు వెంటనే చర్యలు తీసుకుని మాతాజీ నగర్ ఎఫ్ టి ఎల్ స్థలం లో అక్రమంగా నిర్మించిన మజీద్ నిర్మాణాన్ని తొలగించాలని,అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని ప్రభుత్వ స్థలం అక్రమార్కుల పాలు కాకుండా ఆ స్థలం లో ప్రజలకు ఉపయోగపడే. విధంగా తీర్చిదిద్దాలని,వారు అధికారులను కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్లాట్లు గా చేసి అమ్మకాలు సాగిస్తున్న అధికారులకు పట్టదా…
మాతాజీ నగర్ సర్వే నెంబర్ 194/8/1లో 10ఎకరాల 20 గుంటల ప్రభుత్వ స్థలం వుంది.ఇది ఎఫ్ టి ఎల్ పరిధి లో వుంది.ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్ట రాదు.అయితే ఓ నిర్మాణ సంస్థ ఇక్కడ స్థలాన్ని ప్రయివేటు స్థలంగా పేర్కొంటూ ప్లాట్లు గా చేసి అమ్మకాలు సాగిస్తున్నా అధికారులు పట్టించు కొక పోవడం పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొందరు సిబ్బంది ప్రోత్సాహం తోనే ఇక్కడి నిర్మాణాలకు ఇంటి నెంబర్లూ వస్తున్నాయని,మరో అడుగు ముందుకు వేసి విద్యుత్ మీటర్లు సైతం ఇస్తుందంటం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది.తాజాగా మజీద్ నిర్మాణం చేయడం మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు అని,ఇన్ని జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించు కోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కూత వేటు దూరం లో వున్న ఈ స్థలాన్ని రక్షించడం లో అధికారులు విఫల మయ్యారంటే ఇక మారు మూల ప్రాంత లో పరిస్తితి ఏంటని బీ జె పీ నేతలు ,బస్తీ వాసులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు ప్రభుత్వ స్థలం లో వున్న అక్రమ నిర్మాణాలను,మజీద్ ను తొలగించి ప్రభుత్వ స్థలం లో ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.లేని పక్షంలో మాతాజీ నగర్ బస్తీ వాసులు,బీ జె పీ ఆధ్వర్యం లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *