పాఠశాల ప్రారంభ మైంది ….పరేషాన్ మొదలైంది ….

బేగంపేట లో ఓ ప్రయివేటు పాఠశాల నిర్వాకం వాహన దారులను పరేషాన్ చేస్తుంది. ఆ పాట శాల ప్రారంభ మైన దంటే చాలు ప్రధాన రోడ్ పైన ట్రాఫిక్ జాం జాం గా మారిపోతుంది.దీంతో ఈ మార్గం లో రాక పోకలు సాగించే వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.బేగంపేట ప్రధాన రోడ్ కు అనుకుని వున్న ఓ పాట శాలకు వచ్చే వాహనాలతో ఫతెనగర్ లింక్ రోడ్,పంజాగుట్ట వైపు నుంచి వచ్చే వాహన దారులకు నరకాన్ని చవి చూస్తున్నారు.గతం లో వున్న ఎంట్రీ గేట్ మయూరి మార్గ్ జంక్షన్ ఎదురుగా వుండేది.కొద్ది నెలల క్రితం ఫతే నగర్ లింక్ రోడ్ వైపు వున్న ఈ పాట శాల గేట్ ను ఇన్ గేట్ గా మార్చారు .దీంతో ఈ ప్రాంతం లో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి.ఉదయం,సాయంత్రం సమయం లో పాఠశాలకు వచ్చే వాహనాలు ఇన్ గేట్ ముందు భారీగా నిల్చి పోతుందటం తో అటు పంజాగుట్ట వైపు నుంచి,ఇటు ఫతే నగర్ లింక్ రోడ్ వైపు నుంచి వచ్చే వాహనాలు పాఠశాల వద్ద గేటు వద్ద నిల్చి పోయిన వాహనాలతో ట్రాఫిక్ లో చిక్కుకొని ఈ ప్రాంతం లో ట్రాఫిక్ జాం అవుతుంది.రెండు ఫ్లై ఓవర్లు దిగే ప్రాంతంలో ఈ పాట శాల వద్ద వాహనాలు రోడ్ పైన నిల్చిపోతుందటం తో ప్రమాదాలకు ఆస్కారమిస్తుంది.వేగంగా వస్తున్న వాహనాలు ఒక్క సారిగా బ్రేకులు వేస్తున్న సమయం లో వెనుక నుంచి వచ్చే వాహనాలు డీ కొంటున్నాయని పలువురు వాహన దారులు ఆరోపిస్తున్నారు. ఈ పాట శాల లో పార్కింగ్ స్థలం వున్నా వాహనాలను రోడ్ పైన నిలిపి వుంచడం పై స్థానికులు ,వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సోమవారం ఈ ట్రాఫిక్ జాం లో చిక్కుకున్న అంబులెన్స్ 10నిమిషాల తర్వాత అక్కడి నుంచి బైట పడిందంటే ఇక్కడి పరిస్థితీ ఏమిటన్నది అర్థం అవుతుంది.పాద చారులు కూడా నడిచేందుకు మార్గం లేకుండా పోతుందని ,ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రాంతం లో ట్రాఫిక్ జాం కాకుండా చూడాలని వాహన దారులు ప్రజలు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *