తాళ్లూరు మండలంలోని శివరాంపురం, తురకపాలెం, లక్కవరం గ్రామాల్లో పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసుల ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఏర్పాటు చేశారు. బుధవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు పోలీసు సిబ్బం దితో పికెట్లు ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలందరూ తోడ్పాటు అందించి ప్రశాం తంగా ఉండాలని ఎస్సై విజయ్ కుమార్ కోరారు. ఘర్షణ లకు తావిస్తే ఎంతటి వారిపైనైనా చట్టపరంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు.
