ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులే నేడు వివిధ రంగాలలో గొప్ప స్థాయి లో ఉంటూ దేశ అభి వృద్ది లో కీలక పాత్ర పోషిస్తున్నారు అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడి బాట కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ మరియు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7 లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే ఈరోజు వివిధ రంగాల్లో గొప్ప స్థాయిలో ఉంటూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు కూడా బంగారు భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్బంగా దానం విద్యార్థులతో కాసేపు ముచ్చటంచి పాట శాలలో సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలకు, నాణ్యమైన విద్యా బోధనకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు రావడానికి, పేద విద్యార్థుల కుటుంబాల మీద ఆర్థిక భారం పడకుండా నాణ్యమైన బోధన ద్వారా మోడల్ పాఠశాలలను తీర్చిదిద్ధుతున్నామన్నారు.
ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, వెంకటేశ్వర డివిజన్ కార్పొరేటర్ మన్నె కవిత , స్థానిక నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


