బాలంరాయి దండు మారెమ్మ దేవాలయ కమాన్ నుంచి అన్నా నగర్ చౌరస్తా వరకు ప్రయివేటు బస్సులను అక్రమంగా పార్కింగ్ చేస్తూ ట్రాఫిక్ జాం కు కారణ మవుతున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని ఇటుక గోపి మాదిగ,దండు మారెమ్మ దేవాలయ సభ్యులు గుండం రమేష్, ఈపూరు వినోద్ కుమార్,మురళీ గౌడ్,మదు సుధన్ రావ్,ఉమేష్ తదితరులు బేగంపేట ఏ సి పీ గోపాల కృష్ణ మూర్తి కి వినతి పత్రం అందజేశారు.కొద్ది రోజుల క్రితం దండు మారెమ్మ దేవాలయ కమాన్ నీ గుర్తు తెలియని వాహనం డీ కొట్టిందని,దీంతో కమాన్ భారీగా ధ్వంసం అయిందన్నారు .ప్రమాదానికి కారణ మైన వాహనాన్ని గుర్తించాలని ,వాహనాన్ని నడిపిన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని వారు ఏ సి పి నీ కోరారు.బాలం రాయి దండు మారెమ్మ దేవాలయ కమాన్ నుంచి అన్నానగర్ తెలంగాణా తల్లి విగ్రహం వరకు నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని,పరిసరాలను అపరి శుభ్రంగా చేస్తున్నారని,ప్రయివేటు బస్సు లు ఇక్కడ పార్కింగ్ చేయకుండా చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.సానుకూలంగా స్పందించి న ఏ సి పీ గోపాల కృష్ణ మూర్తి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
