కళాకారులను సన్మానించిన కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ………………….

తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ లిమిటెడ్  సౌజన్యంతో కూకట్ పల్లి రామాలయం వద్ద భారత్ వికాస్ పరిషత్ ట్రస్ట్ వేదిక పై శ్రీ కృష్ణరాయబారం పద్య నాటకం వేశారు.నిర్వాహకులు తోట సత్యనారాయణ , శ్యామ్, పట్టేల మురళీధర్, కోడిదల శివకుమార్ లు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా * ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయన్ను శాలువాతో ఘనంగా సత్కరించారు..*
ఈ సందర్భంగా ప్రేమ కుమార్  మాట్లాడుతూ పద్య నాటకాలు ,నాటికలు పురాతన కళలని కాపాడుకునేందుకు ఇలాంటి నాటకాలు ,నాటికలు వేయాలన్నారు.నాటి పద్ధతులను నేటి తరానికి తెలియ జేసేందుకు ఇలాంటి నాటికలు వేయాలని ఆయన కోరారు.నాటికను చూస్తున్న సమయంలో తన చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయని, ఇలాంటి నాటకాాలు , నాటికలు అంటే చాలా ఇష్టమని,అన్నారు .తాను  కళాకారులను ప్రోత్సహిస్తానని , అదేవిధంగా కళాకారులను ప్రజలు,  కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకొని ప్రోత్సహించాలని అన్నారు . అనంతరం కళాకారులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి  జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్ ,కలిగినిడి ప్రసాద్ , వాసుదేవరావు ,అడబాల షణ్ముఖ, మోహన్ , రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *