యాదగిరి గౌడ్ మృతి విచారకరం……..తలసాని.

బేగంపేట శ్యామ్ లాల్ బిల్డింగ్ కు చెందిన సీనియర్ నాయకుదు యాదగిరి గౌడ్ అనారోగ్యం తో మృతి చెందడం విచారకరం అని మాజీ మంత్రి,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు.
బేగంపేట శ్యాం లాల్ బిల్డింగ్ ప్రాంతానికి చెందిన బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు యాదగిరి (76) అనారోగ్యంతో బాధపడుతూ బేగంపేట లోని కిమ్స్ హాస్పిటల్ లో వారం రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాస్పిటల్ కు వెళ్ళి యాదగిరి పార్దీవదేహం ను సందర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి ని తెలిపారు. ఎమ్మెల్యే వెంట బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు శ్రీహరి, సత్యనారాయణ, సురేష్ యాదవ్, నరేష్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *