భారత ప్రభుత్వం లోని రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నీ దక్షిణ మధ్య రైల్వే జోన్ రాజమండ్రి రైల్వే స్టేషన్ సమగ్ర పునరాభివృద్ది కోసం ప్రణాళికను సిద్దం చే స్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ అన్నారు.రాజమండ్రి రైల్వే స్టేషన్ కు పేరుగుతున్న ప్రయాణీకుల సామర్థ్యానికి అనుగుణంగా వసతుల కల్పన,పునరాభివృద్దీ కోసం 250 కోట్ల అంచనా వ్యయం తో రాజమండ్రి స్టేషన్ ను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలియజేశారు.ప్రతి రోజూ ఈ స్టేషన్ లో ఆగే 86 రైళ్ల తో పాటు ఈ స్టేషన్ నుంచి ప్రారంభమై ఇక్కడ ప్రయాణాన్ని ముగించే మూడు రైళ్లు తో పాటు డిమాండ్ కు అనుగుణంగా పునరాభి వృద్ది చేయబడుతుందన్నారు.250
కోట్ల వ్యయంతో పలు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.మరో 50సంవత్సరాల అవసరాలను తీర్చడానికి అవసర మయ్యే సౌకర్యాలతో ఆధునిక స్టేషన్ భవనం నిర్మాణం చేయనున్నారు.విశాలమైన కాంక్రోస్ ,టెర్మినల్ బిల్డింగ్ తో కలిపే రూఫ్ ప్లాజా,ఫుడ్ కోర్టు, రిటైల్స్, ఏ టీ ఎమ్,వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్తాల్స్,కిడ్స్ ప్లే జోన్ ,ఫార్మసీ,ఇంటర్నెట్, టాయిలెట్స్,మొదలైన అన్ని అవసరమైన సౌకర్యాలు ప్లాట్ ఫామ్ లపై ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.దివ్యాంగులు,సీనియర్ సిటిజన్స్ కు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.విశాలమైన సర్కులేటింగ్ ప్రాంతం,ప్రయాణీకుల రాకపోకలకు పికప్,డ్రాపింగ్ వచ్చే వాహనాల కోసం పార్కింగ్ కోసం మాత్రమే తగిన సదుపాయం.పర్యావరణ హిత భవనాలు,ఎనర్జీ సేవింగ్,సోలార్ ప్యానెల్స్,ఫైర్ ఫైటింగ్,ఇంకుడు గుంతలు, వేస్టే వాటర్,స్మార్ట్ వాటర్ పునర్వినియోగం,వ్యర్థ పదార్థాల వినియోగం,వాణిజ్య అభివృద్ధికి స్థలం కేటాయింపు,ప్లాట్ ఫార్మ్ లు,ట్రాక్ లు,సిగ్నలింగ్ వ్యవస్థల పునరాభివృధ్ధి,ఎయిర్ కండిషనింగ్ వైయిటింగ్ లాంజ్ లు, ఎస్క లేటెర్లు మరియూ ఎలివేటర్లు తో సహా ప్రయాణీకుల సౌకర్యాలు పెంపు.పునరాభివృద్ధీ చేయబడిన స్టేషన్ నుంచి 2071-72 సంవత్సరం నాటికి గంటకు 9533 మరియూ రోజుకు 96328 మంది ప్రయాణికులకు సేవలను అందించగలిగే సామర్థ్యం కలిగి అంచనాలకు అనుగుణంగా రూపొందించబడి ప్రపంచ స్థాయి రవాణా కేంద్రంగా మారుతుందన్నారు.ఇక్కడి నుంచి ప్రధాన ప్రాంతీయ రవాణా కేంద్రంగా,వ్యాపార కేంద్రంగా వున్న రాజ మండ్రి గణ నీయ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నారు.నగరం లోని వస్త్ర,కాగిత,పొగాకు పరిశ్రమలతో పాటు పర్యాటక,సాంస్కృతిక ,మరియూ మౌలిక సదుపాయాలను మరింత పెంపొందిస్తున్నా మన్నారు.



