ఆర్ధిక లేమితో ఎవరూ చదువుకు దూరం కాకూడదు.- శ్రీ కాళిదాసు సేవా సమితి అధ్యక్షురాలు తీగల సత్యవతి – పేద విద్యార్థినికి ఆర్థిక చేయూత

జీవితంలో విద్య ప్రతి ఒక్కరినీ ఉన్నత స్థానంలో నిలుపుతుందని, ఆర్థిక లేమితో ఏ ఒక్కరూ విద్యకు దూరముకాకూడదనే భావనతో శ్రీ కాళిదాసు సేవా సమితి పనిచేస్తుందని సమితి అధ్యక్షురాలు తీగల సత్యవతి పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సోమవారం ఉదయం సమితి కార్యాలయం తమ గృహం వద్ద పదవ తరగతి చదువుతున్న పేద విద్యార్థిని డి. సాహితికి 15 వేల రూపాయల నగదును రంగిశెట్టి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రంగిశెట్టి సురేష్ బాబు సహకారంతో అందించారు.

ఈ సందర్భంగా సాహితి చదువు నిమిత్తం అవసరమైన ఆర్థిక వనరులను సంవత్సరాంతం తమ ఫౌండేషన్ సమకూరుస్తుందని సురేష్ బాబు తెలిపారు. విద్యను మక్కువతో అభ్యసించి మంచి ఉన్నతి సాధించాలని సాహితిని ఆకాంక్షించారు. సత్యవతి మాట్లాడుతూ పాప ఆర్థిక పరిస్థితి తెలుపడంతోటే స్పందించి అవసరమైన ఆర్థిక సహకారం అందించిన రంగిశెట్టి సురేష్ బాబుకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో దేవరపల్లి శ్రీలక్ష్మి, తీగల కేదార్నాథ్, శ్రీనివాసరావు, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *