ఎస్ ఐ ఆర్ పై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే మాధవరం.

కూకట్ పల్లి జూలై 2,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఎస్ ఐ ఆర్ పై కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం ఎస్ఐఆర్ పై సమీక్ష నిర్వహించారు.క్యాంపు కార్యాలయంలో కూకట్పల్లి, శేర్లింగంపల్లి నియోజకవర్గం
సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ జరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని .ఈ విషయంలో బి .ఆర్. ఎస్ పార్టీ తరఫున BLA అందరూ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించిచూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అధికారులు కూడా దీనిపై పూర్తి అవగాహన లేని కారణంగా ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారని దీనిపై పూర్తి సమాచారం ప్రజలకు చేరవేయగా మనం కూడాఅందుబాటులో ఉండి అనుమానాలు నివృత్తి చేయాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు.. ముఖ్యంగా ఓటు ఉండి ఎవరైనా అందుబాటులో లేనియెడల తిరిగి మళ్లీ వారికి బి.ఎల్.ఓ లనుఅందుబాటులోకి తీసుకెళ్లి తమ ఓటు హక్కు పరిరక్షించే బాధ్యతతీసుకోవాలని సూచించారు ..ఈ కార్యక్రమంలో కూకట్పల్లి, శేర్లింగంపల్లి నియోజకవర్గం బి.ఎల్.ఎ లు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *