బేగంపేట, జూలై 2,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆర్టీసీ బిసి ఉద్యోగుల హైదరాబాద్ జోన్ గౌరవ అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ లు తెలిపారు. ఈ మేరకు వారు గురువారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్
కార్యాలయంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. గత ఏప్రిల్ నెలలో ఆర్టీసీ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టిన సందర్భంగా డ్రైవర్ శంకర్ ఆత్మహత్య కు పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్టీసీ బిసి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 8 వ తేదీన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శంకర్ కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. వారి వెంట సికింద్రాబాద్ రీజియన్ గౌరవ అధ్యక్షుడు సాదం బాలరాజ్ యాదవ్ ఉన్నారు.
