ప్రకాశం నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దర్గా కరుణాకర్.

బేగంపేట జులై 2,(జే ఎస్ డి ఎం న్యూస్) :
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి నియోజకవర్గం ప్రకాశం నగర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడిగా దర్గా కరుణాకర్ నియమితులయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బి మహేష్ కుమార్ గౌడ్ నియామకాలను ప్రకటించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని 16 డివిజన్లకు నూతన అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్
యాదవ్,నియోజక వర్గం ఇన్చార్జి బండి రమేష్ ల ప్రతిపాదనల మేరకు కూకట్పల్లి నియోజకవర్గం లోని 16 డివిజన్లకు నూతన అధ్యక్షుల నియామకం జరిగింది. వీరిలో ప్రకాశం నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దర్గా కరుణాకర్, కూకట్పల్లి డివిజన్ అధ్యక్షుడిగా కావేటి నాగార్జున, బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్షుడిగా రాజేష్ శౌ, వసంత నగర్ డివిజన్ అధ్యక్షుడిగా కిలారి శ్రీనివాస్ బాబు, కెపిహెచ్బి కాలనీ డివిజన్ అధ్యక్షుడిగా దండి అరవింద రెడ్డి, కైతలాపూర్ డివిజన్ అధ్యక్షుడిగా కలికోట శంకర్, గాయత్రి నగర్ డివిజన్ అధ్యక్షుడుగా మస్తాన్ రెడ్డి దేవంటి, గాయత్రీ నగర్ డివిజన్ అధ్యక్షుడిగా సుంకన్న, అల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడిగా ఎండి వాజిద్ పాషా, మోతి నగర్ డివిజన్ అధ్యక్షుడిగా కోనంకి గోపాల్ చౌదరి, మూసాపేట్ డివిజన్ అధ్యక్షుడిగా తూము సంతోష్ కుమార్, బాలనగర్ డివిజన్ అధ్యక్షుడిగా పులి శివ గౌడ్, ఫతేనగర్ డివిజన్ అధ్యక్షుడిగా కుక్కల క్రాంతి ముదిరాజ్, ప్రశాంత్ నగర్ డివిజన్ అధ్యక్షుడిగా కొంత ఓల్డ్ టీవీ చంద్ర రావు, ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ అధ్యక్షుడిగా వి .అరవింద్ కిషోర్ (సన్నీ), అస్మత్ పెట్ డివిజన్ అధ్యక్షుడిగా షేక్ గౌస్ లతీఫుద్దీన్ లను నియమిస్తూ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం నగర్ డివిజన్ అధ్యక్షుడిగా నియమితులైన దర్గా కరుణాకర్ మాట్లాడుతూ తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబమని అన్నారు. తనపై విశ్వాసం ఉంచి ప్రకాశం నగర్ డివిజన్ అధ్యక్షుడిగా నియమించిన టిపిసిసి అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్, కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్, బేగంపేట సీనియర్ కాంగ్రెస్ నాయకులు గౌరపల్లి రమేష్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకాశం నగర్ లో కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయిలో బలపరిచేందుకు కార్యకర్తల సహకారంతో ముందుకు సాగుతానన్నారు. తనకు అన్నివేళలా అండగా నిలిచిన, నాయకులకు, కార్యకర్తలకు కరుణాకర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *