ఓల్డ్ అల్వాల్ లోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మత్సవాల్లో మల్కాజ్ గిరి ఎమ్ పి ఈటెల రాజేందర్ పాల్గొని పూజలు నిర్వహించారు.
ఈ నెల 14 నుండి ప్రారంభమైన ఉత్సవాలు 19 బుధవారం వరకు కొన సాగనున్నాయి.శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనములతో బాలాజీ టెంపుల్ ట్రస్ట్ వారిఓల్డ్ అల్వాల్ లోని శ్రీ పద్మావతీ గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామివారి దేవాలయ షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ భాజపా సీనియర్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా స్వచ్ఛ భారత్ కన్వీనర్ అన్నమనేని శ్రీనివాసరావు తో కలసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
