మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరామర్శించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ అధ్యక్షులు తలసాని శంకర్ యాదవ్ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సోమవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని వారి నివాసానికి చేరుకొని శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు.

