దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గంగిరెడ్డి పాలెం కోటిరెడ్డి సోమవారం మృతి చెందారు. ఆయన కుమారుడు గంగిరెడ్డి పాలెం యలమందా రెడ్డి వైఎస్సార్సీపీ క్రీయాశీలక కార్యర్తగా, జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ సేవాదళ్ కార్యదర్శి గా పనిచేస్తున్నారు. మాజీ ఎంపీటీసీ మృతి పట్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిథులు, వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.


