బేగంపేట బ్రాహ్మణ వాడి మార్గం లో చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకి తగులు తుందటం తో నిప్పురవ్వలు వస్తున్నాయి.దీంతో ఆ మార్గం లో వెళ్ళే వాహన దారులు ,స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెట్టు కొమ్మలు నీటితో కింద వున్న తీగలను తాకుతున్నాయి.దీంతో నిప్పు రవ్వలు ఎగిసిపడుతున్నాయి అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిప్పు రవ్వలు ఎగిసిపడుతుండటం తో ఇదే విషయాన్ని స్థానికులు కొందరు విద్యుత్ అధికారులకు పిర్యాదు చేశారు.వర్షాకాలం వచ్చిందంటే ఇలా రోడ్ పక్కన వున్న చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు తాకి నిప్పురవ్వలు వస్తున్నాయని,భారీ వర్షాలు రాకముందే చెట్ల కొమ్మల ను విద్యుత్ తీగలకు తగల కుండా కొట్టి వేసి ప్రమాదాలు నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
