మహిళలు ఆర్థికంగా ఎదగాలి…….కార్పొరేటర్లు టి.మహేశ్వరి,ముద్ధం,కొంతం దీపిక……

మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని బేగంపేట్ కార్పొరేటర్ టి. మహేశ్వరి శ్రీహరి ,మొండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక,ఓల్డ్ బోయిన్ పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహాయాదవ్ లు ఆకాంక్షించారు. శుక్రవారం ఓల్డ్ బోయిన్ ఫల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన సుమన్ సారీ సెంటర్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో వున్నారని,ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు .ఆధునిక డిజైన్లు అద్భుతమైన రంగులలో సుమన్ సారీ సెంటర్లో మహిళలు మెచ్చే చీరలను అందుబాటులోకి తీసుకురావడం ఎంతో సంతోషం అన్నారు .శారీ సెంటర్ అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో వినియోగదారుల ఆధారాభిమానాలు చూరగొని మరెన్నో సెంటర్ లు గా విస్తరించాలని వారు ఆకాంక్షించారు .ఈ సందర్భంగా నిర్వాహకురాలు సుమలత ను కార్పొరేటర్లు అభినందించారు.ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే భార్య,భర్తలు ఇద్దరూ కృషి అవసరం అన్నారు.
తన భర్త శ్రీశైలం అందిస్తున్న తోడ్పాటుతో షాపును ప్రారంభించామని మహిళలు మెచ్చే అన్ని రకాల వస్త్రాలను తమ షాపులో అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డమీద శ్రీశైలం, జనార్ధన్ ,కృష్ణ ,నరేష్, శ్యామ్ ,వెంకటేష్ ,లక్ష్మణ్ ,రామ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *