పేద విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు రఘు సతీష్ కుమార్ అన్నారు. సోమవారం మణికొండ వీకర్ సెక్షన్ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో సతీష్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘు సతీష్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉంటేనే అనుకున్న గమ్యాన్ని చేరుతారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బోధించే అధ్యాపకులు ఎంతో క్రమశిక్షణ,అపారమైన అనుభవం కలిగి ఉంటారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపోహలను విద్యార్థులు తల్లిదండ్రులు తొలగించుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించిన ఎందరో ప్రభుత్వ అధికారులుగా ఎదిగిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేటి విద్యార్థులే రేపటి భావిభారత పౌరులని వారిని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నేషనల్ అవార్డు గ్రహీత ఆంజనాదేవి ,యోగ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ సింధుజ, కాలనీ ప్రెసిడెంట్ పెంటారెడ్డి విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు


