అజాతశత్రువు జూపల్లి కోటేశ్వరరావు—ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ హెడ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ హెడ్ పి. సంధ్యారాణి.

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపాల్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ పి సంధ్యారాణి అన్నారు. దర్శి వ్యవసాయ పరిశోధన స్థానంలో టైం స్కేల్ ఎంప్లాయ్ గా పనిచేస్తున్న జూపల్లి కోటేశ్వరరావు ఉద్యోగ విరమణ సందర్భంగా జరిగిన ఉద్యోగ విరమణమహోత్సవములో సంధ్యారాణి ముఖ్యఅతిథిగా పాల్గొని అధ్యక్షో పన్యాసంచేశారు. సంధ్యారాణి తన ఉపన్యాసం కొనసాగిస్తూ కోటేశ్వరరావు తనపై పెట్టిన బాధ్యతలను విధి విధానాలపట్ల బాధ్యతాయుతంగా పనిచేసే వారని, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా తమ సలహాలు సూచనలు ఇచ్చేవారని, అందరితో కలుపుకోలు తన0గా ఉండే వారని సంధ్యారాణిపేర్కొన్నారు. కోటేశ్వరరావుకు చెప్పిన పనిని అయిపోయే వరకు నిద్రపోరని తన పనిగా భావించి పనిచేసే వారని సంధ్యారాణితెలిపారు. మరొక శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాద్ రావు మాట్లాడుతూ కోటేశ్వరావు వ్యవసాయ పరిశోధన స్థానంలోను,అలాగే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లోను ఏలాంటి కార్యక్రమాలు చేసిన ముందుండి నడిపించే వారని ఆయన తెలిపారు. ఇక్కడ పని చేస్తూ ఖాళీ సమయాలలో ప్రజల సమస్యలపై, మరియుసమాజ సేవచేసే వారని ఆయన పేర్కొన్నారు. టైం స్కేల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ కుమార్ మాట్లాడుతూ కోటేశ్వరరావుటైం స్కేల్ ఉద్యోగుల హక్కుల కొరకు, మరియు కార్మికుల సమస్యలపై నిరంతర ఉద్యమాలు చేపట్టే వారని ఆయన పేర్కొన్నారు. అనంతరం పదవీ విరమణ పొందిన జూపల్లి కోటేశ్వరావును వారి ధర్మపత్ని జూపల్లి వెంకటరత్న కుమారిలను ఏ ఆర్ ఎస్సిబ్బంది, కెవికె సిబ్బంది, కేజీబీవీ సిబ్బంది,సిడిపిఓ మరియు అంగన్వాడి సిబ్బంది, వైయస్సార్ హార్టికల్చరల్ సిబ్బంది, ఉద్యోగఉపాధ్యాయ సంఘాలు, ఏ ఆర్ఎస్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బంది, సిబ్బందిబంధువులు, ప్రజా సంఘాల నాయకులు, శాలువాలు కప్పి, పూలదండలు వేసి, బట్టలు, చిత్రపటాలను, బహుకరించారు. ఈ కార్యక్రమంలో టైం స్కేల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి మురళి చలపతి, రాముడు, దర్శి మండల సిడిపిఓ భారతి ఏఐకేఎస్ రాష్ట్ర నాయకులు వీరారెడ్డి, పిఓఏ నాగ హరీష్, పివి రామ్మోహన్ రావు, ఎల్.వి,రమణయ్య,సంఘ సేవకుడు జీవిరత్నం,అట్లూరి రామారావ, బసవయ్య,సందు వెంకటేశ్వరరావు, రావూస్ ఫర్నిచర్స్ అధినేత చేబ్రోలు సుధాకర్, అన్నవరపు వెంకటేశ్వర్లు, గండిపూడి ప్రేమ్ కుమార్, టిడిపి నాయకులు జూపల్లి వీరారావు, జె.కోటేశ్వరరావు, మోశే తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *