పశువులకు మేత గా ఉపయో గించే పంటలను పశుగ్రసాలుగా చెప్పవచ్చు. వీటిని మనం పొలాల్లో సాగు చేయడమే కాకుండా, అడవి జాతికి చెందిన మొక్కలను కూడా పశుగ్రాసాలుగా వాడుతూ ఉంటాము. పశువులకు మేతగా ఉపయోగించే పంటలలో ధాన్యపు జాతి, గడ్డి జాతి మరియు పప్పు జాతి పంటలు ముఖ్యమైనవి తాళ్లూరు మండల పశువైద్యాధికారి వి. ప్రతాప్ రెడ్డి తెలియజేశారు. తాళ్లూరు మండలం దారంవారిపాలెం గ్రామంలోని రైతు భరోసా కేంద్రం నందు దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ రైతులకు వ్యవసాయ అభివృద్ధి పథకాలపై అవగాహన ఇచ్చి, కృషి విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో పశుపోషకులకు పశుగ్రాసం కొరకు గడ్డి విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మంచి పశుగ్రాసాలను అధిక jఉత్పత్తి తో పండించాలంటే వాటి యొక్క ముఖ్యమైన రకాలతో పాటు పండించే పరిస్థితులు , యాజమాన్య పద్ధతులు తెలుసుకోవాలని ఆయన పశుపోషకులకు తెలియజేశారు. దళిత బహుజన రిసోర్స సెంటర్ రియల్ కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఉన్న పశుపశుకులు వారి పశువులకు ఆయా వాతావరణానికి అనుకూలమైన పరిస్థితులకు అనుకూలమైన పంటలను సాగుచేసుకోవాలి. తద్వారా అధిక పాల దిగుబడి రావటానికి పశుగ్రాసం కొరకు ఈ గడ్డి విత్తనాలు ఉపయోగపడతాయని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వెటర్నరీ అసిస్టెంట్. సిహెచ్. బ్రహ్మయ్య,గ్రామస్తులు పాల్గొన్నారు. తదుపరి పశుపోషకులకు విత్తనాలు పంపిణీ చేయడం జరిగినది.


