బీ ఎల్ ఓ లకు సరియైన సమాచారం ఇవ్వండి. ఓటు కాపాడుకోండి..పి.విజయారెడ్డి.

ఖైరతాబాత్ జూలై 1,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఇంటింటికి వచ్చే బీ ఎల్ ఓ లకు సరియైన సమాచారం ఇవ్వండి. ఓటు కాపాడుకోండి.అని ఖైరతాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేపి.విజయారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.ఖైరతాబాద్ నియోజకవర్గంబంజారా హిల్స్ డివిజన్ లో
బుధవారం ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమంలో విజయారెడ్డి , డివిజన్ మాజీ కార్పొరేటర్ అభ్యర్థి ధనరాజ్ రాథోడ్, డివిజన్ సీనియర్ నాయకులు బాల నరసింహ , సత్యనారాయణ , మాధురి తదితరులు బీఎల్‌ఓలతో కలిసి బస్తీలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఓటర్లకుఎన్యూమరేషన్ (Enumeration) ఫారాలను పంపిణీ చేసి, తమ ఓటు హక్కునుకాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఓటరు జాబితాలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. దానిపై అవగాహన కల్పించారు. అలాగే అర్హత కలిగిన ప్రతి ఓటరు తన వివరాలను సరిచూసుకుని, అవసరమైన చోట ఎన్యూమరేషన్ ఫారాన్ని సక్రమంగా సమర్పించాలని సూచించారు. ప్రజలకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *