పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలకు కమ్యూనిస్టుల పోరాటాలే ప్రత్యామ్నాయం…………..

పాలకవర్గాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు కమ్యూనిస్టు పార్టీల పోరాటాలు ప్రత్యామ్నాయమని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ ప్రాంతంలోని అడ్డగుట్ట ఎంసిపిఐ(యు) కార్యాలయంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులు జరిగినాయి.ముందుగా అద్దగుట్ట ఎ- సెక్షన్ లోని అమరజీవి కామ్రేడ్ ఉపేందర్ స్థూపం వద్ద నివాళులు అర్పించారు . అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు గాదె మల్లేష్ జెండా ఆవిష్కరణ చేసిన బి సెక్షన్ లోని యంసిపిఐ(యు)కార్యాలయం లోఎంసిపిఐ(యు) కార్యాలయంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులు జరిగినాయి. శిక్షణ తరగతులకు ముఖ్యవక్తగా విచ్చేసిన యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగొని రవి ఉపాధ్యాయులుగా ప్రస్తుత అంతర్ జాతీయ,జాతీయ రాజకీయ విధానాలను,పార్టీ కార్యక్రమాలను బోధించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన పది సంవత్సరాల లో గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పేరుతో అనేక ప్రజావ్యతిరేక విధానాలను అవలంబించిందని ఆ పార్టీని తిరస్కరించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారం వచ్చాక పెట్టుబడుదారి కార్పొరేట్ శక్తులకు అనుగుణమైన విధానాలతోపాలిస్తుందని బిఆర్ఎస్,కాంగ్రెస్ పాలక స్వభావం ఒకటేనని ఆరోపించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన ప్రజా వ్యతిరేక నిరంకుశ చట్టాల పైన ఆనాడు బిఆర్ఎస్,ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గొంతు ఎత్తలేవని ఆరోపించారు. ప్రజా సంక్షేమం పేరుతో ప్రజలను పక్కదారి పట్టించే విధానాలు చేపడుతుందని అన్నారు. ఎన్నికలలో ప్రజలకు వచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోతే ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పాలకవర్గాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల పోరాటాలే ప్రత్యామ్యం తప్ప మరో మార్గం లేదని అన్నారు. ఎంసిపిఐ(యు) ప్రజా పోరాటాల బలోపితానికి కార్యకర్తలు పార్టీ నాయకత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలకు ఎదురవుతున్న సమస్యల పోరాటాలు చేయవలసి ఉందని ప్రజలకు చేరువయే కార్యక్రమాలను రూపొందించుకొని ప్రజా శ్రేణులలో మమేకం కావాలని అన్నారు.రాష్ట్రానికి హైదరాబాద్ పేరుకు మాత్రమే రాష్ట్ర రాజధాని అప్పటికి అనేక సమస్యలతో అలాగే వుందని వీటి పరిష్కారానికి తగిన కార్యక్రమాలు రూపొందించి పోరాటాలు నిర్వహించాలని ప్రజా పోరాటాలే పాలకవర్గాలకు ప్రత్యామ్నాయమని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గా గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ వ్యవరించగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు గాదే మల్లేష్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు కుంభం సుకన్య, అంగడి పుష్ప, ఇ.దశరథ్ నాయక్, కమిటీ సభ్యులు యార్లగడ్డ రాంబాబు, బి యాదగిరి, ఎస్ లక్ష్మణ్, దేవనూరు లక్ష్మీ మరియు సుంచు రాజు,జి లావణ్య,జి శివాని,జి.లలిత,బి.పార్వతి, డి.నరసింహ,భూసాని రవి,బి.లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *