కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉత్తర హాట్స్, కొమురయ్య హాట్స్, అంబేద్కర్ హాట్స్ బస్తీలలో కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా బస్తిలలోని సమస్యలను బస్తివాసులను అడిగి తెలుసుకున్నారు .స్థానికులు డ్రైనేజ్ ,రోడ్లు, తాగునీటి సదుపాయం, దోమల బెడద, నల్లాల సమస్య పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు స్పందించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ గుడిసే వాసులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయనున్నా మని అని అన్నారు .తాగునీటి ట్యాంక్ పగిలిపోయి ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఆ ప్రాంతంలో కొత్త ట్యాంక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఉత్తరయ్య హట్స్ బస్తీ వాసి కి ప్రమాదవశాత్తు కాళ్లు పడిపోవడంతో మంచానికే పరిమితమయ్యాడు అని తెలుసుకున్న శ్రీ గణేష్ బాధితుని పరామర్శించి స్పందించి వెంటనే అతనికి ఆర్థిక సహాయం అందించారు. గాంధీ ఆసుపత్రి సూపర్డెంట్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, ఆయా బస్తీల వాసులు పాల్గొన్నారు
