పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా వీధి కుక్కలు మనుషులపై, వాహనాలపై వెళ్తున్న వారి వెంబడిస్తూ ప్రాణాలకు ముప్పు తెచ్చిన సంఘటనలు అనేకం చూస్తున్నామని వాటి నుండి తప్పించుకునేందుకు చిన్న పాటి జాగ్రత్తలు పాటిస్తే సురక్షితంగా ఉండవచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్కె బేబి రాణి సూచించారు.
కుక్కలు మీ వెంట పరిగెత్తిన లేదా మిమ్మల్ని చూసి మొరగటం మొదలు పెట్టిన టెన్షన్ పడి భయపడకుండా వాటి ముందు స్థిరంగా నిలబడాలని అన్నారు. ఇలా కాకుండా పరిగెత్తినట్లయితే కుక్క ఖచ్చితంగా దాడి చేస్తుందని అందుకే అలాంటి సమయంలో కదలకుండా స్థిరంగా, ధైర్యంగా ఉంటే కుక్కల దూకుడు తగ్గుతుందని అలాగే పక్కకు వెళ్లిపోతాయని చెప్పారు.
- కుక్కలు మిమ్నల్ని చూసి అరిచినా మీ దిక్కు వస్తున్నా గట్టిగా అరవాలని… చాలా కుక్కులు గట్టిగా అరవటం వలన ప్రతిస్పందిస్తాయని …. మీరు అలర్ట్ చేసినట్లు అర్థం చేసుకుని అక్కడ నుండి వెళ్లిపోతాయని చెప్పారు.
”మీ దగ్గరలో ఎదైనా బ్యాగ్ లేదా గొడుగు, కర్ర వంటి వస్తువులు ఉన్న దాన్ని మీరు కుక్కల దాడి సుంరక్షించుకోవటానికి ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కుక్క మీకు దగ్గరగా వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న వస్తువులను మీకు కుక్కకు మధ్య పెట్టనట్లయితే కుక్క తిక మక పడి మీపై దాడి చేయటం తగ్గుతుందని తెలిపారు.
కుక్క మీపై దాడి చేయటానికి సిద్ధంగా ఉంటే దాని నుంచి వెంటనే పారిపోయే ప్రయత్నం మాత్రం చేయవద్దని, కుక్క నీకు ఎదురుగా ఉన్నప్పుడు నెమ్మదిగా వెనక్కి వెళ్లండి. త్వరగా దూరంగా వెళ్లటానికి లేద పారిపోవటానికి ప్రయత్నిస్తే కుక్క మీపై చాలా త్వరగా దాడి చేసే అవకాశం ఉందని చెప్పారు.
- నీపై దాడికి ప్రయత్నించినప్పుడు దానిపై అరవటానికి బదులుగా దాన్ని ప్రేమగా చూడండి అలాగే నీ మాటలతో దానికి శాంత పరచడానికి ప్రయత్నించండది. కుక్క మొరిగితే లేదా పరిగెత్తితే నిలబడమని ప్రేమగా చెప్పాలని, కుక్కలను మన హావ భావాలు బాగా తెలుస్తాయని వివరించారు. ఏదైనా తప్పనిసరి పరిస్థితులలో కుక్కలు దాడి చేస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రాధమిక వైద్యశాలలో తగిన చికిత్స చేయించుకోవాలని వివరించారు.