తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ వ్యాపార కేంద్రమైన సికింద్రాబాద్ బట్టల బజార్, అలాగే చారిత్రాత్మకమైన శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయం సమీపంలో ఉన్న మూత్ర శాలను కూల్చివేయడంతో వ్యాపారస్తులు ఆందోళనలకు గురవుతున్నారు. 70 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ మూత్ర శాల బట్టల బజార్,జనరల్ బజార్ వ్యాపారస్తులకు,శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంకు వచ్చే భక్తులకు ఎంతో అందుబాటులో ఉన్నాయి. అయితే కొంత మంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ మూత్ర శాలను సంబంధిత అధికారులతో కూల్చి వేయించడం జరిగిందని సికింద్రాబాద్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి,సనత్ నగర్ నియోజకవర్గం బీజేపీ సీనియర్ నేత చీర సత్యనారాయణ శ్రీకాంత్ విమర్శించారు. వ్యాపారస్తులు,ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉన్న ఈ మూత్ర శాలను కూల్చడం అవివేకం, అనాలోచిత నిర్ణయమని శ్రీకాంత్ విమర్శించారు. కూల్చివేత విషయం పై
మహంకాళీ పోలీస్ స్టేషన్ లో అసోసియేషన్ సభ్యులు, బీజేపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు.
కూల్చి వేసిన మూత్ర శాలను మున్సిపల్ అధికారులు తక్షణం పునరుద్ధరిచాలని వారు డిమాండ్ చేశారు. కూల్చివేతకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


