పచ్చదనాన్ని పెంపొందించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం, తూర్పు నాయుడుపాలెంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొని మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. పచ్చదనాన్ని పెంపొందించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. చెట్లు పెంచడం ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించాలి. జీవకోటి రాశుల మనుగడకు మొక్కలే జీవనాధారం.
సహజవనరులు, అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రానున్న ఐదేళ్లలో ఏపీని గ్రీన్ ఏపీగా మార్చుదాం, దీనికి ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఒక మొక్కను నాటాలని మంత్రి పిలుపునిచ్చారు.
