తాళ్లూరు ఏ బి సి స్కూల్ కి చెందిన అనపర్తి అఖిలేష్ సైనిక స్కూల్ ప్రవేశ పరీక్షలో ఎంపికయ్యాడు. అఖిలభారత స్థాయిలో 2024-2025 విద్యాసంత్సరానికి గాను సైనిక స్కూల్ ప్రవేశానికి ప్రవేశ పరీక్ష రాశాడు.ఆ విద్యార్ధి స్థానిక ఏబీసీ స్కూల్ నందు 5వ తరగతి చదువుతున్నాడు. ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు సాధించటంతో తమిళనాడు రాష్ట్రం తుతి కొరిన్ వికాస సైనిక స్కూల్లో 6వతరగతి ప్రవేశానికి సీటు లభించింది. అఖిలేష్ తండ్రి అనపర్తి దాసు విద్యుత్తు. శాఖలో చిరుఉద్యోగం చేస్తూపిల్లలను చదివిస్తున్నాడు. విద్యార్థి ఉత్తమ ప్రతిభ కన పరిచి సైనిక స్కూల్కు ఎంపిక కావటం పట్ల కరస్పాం డెంట్ టి.శ్రీనివాసరెడ్డి, హెచ్ఎం కె.వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కాలేషాబాబు, తల్లిదండ్రులు అభినందించారు.
