సేవా భారతి ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి విద్యా కేంద్రం లో ఆదివారం ఒంగోలులో అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న పారిశుధ్యకార్మికులకు, కాటి కాపరులకు సన్మానించారు. వారి సేవలను వక్తలు కొనియాడారు. అఖిల భారత ధర్మ జాగరణ సహ ప్రముఖ్ శ్రీ అలే శ్యామ్, అర్ ఎస్ ఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శ్రీ రామ ప్రసాద్, నగర అధ్యక్షుడు బత్తిన మహేష్, క్విజ్ విద్యాసంస్థల చైర్మన్ కళ్యాణ్ చక్రవర్తి , రైజ్ కళాశాల డైరెక్టర్ రంగమన్నార్, ఎకేవికే కాలేజి అధ్యక్షుడు మండువ నాగేశ్వర రావు, సెక్రటరీ పల్లపు చెంచురామయ్య, జిల్లా సేవా ప్రమఖ్ శేషా రావు, నగర సేవా ప్రముఖ్ ఏడుకొండలు, పుర ప్రముఖులు, అర్ఎస్ఎన్ విశ్వహిందూ పరిషత్ కర్యకర్తలు పాల్గొన్నారు.
