జాతి పిత మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భముగా బిజెపి ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ వైసి యోగయ్య యాదవ్ ఆధ్వర్యములో ఒంగోలు లో గాంధీ రోడ్ లోని గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనముగా నివాళులు అర్పించారు. ఈ సందర్భముగా యోగ య్య యాదవ్ మాట్లాడుతూ…. సత్యాగ్రహమే ఆయుధముగా …అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహాత్మా గాంధీ గారి జయంతి ని… జైజవాన్ జైకిసాన్ అని నినదించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు మరియు మన ప్రియతమ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ పిలుపు మేరకు స్వచ్చ భారత్ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా జరుపు కోవటం ….140కోట్ల మంది భారతీయులు ఎంతో ఆనందముగా ఉన్నారని ….మహాత్మా గాంధీజీ పోరాటము వలనే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అని….. భారత దేశం ప్రపంచములోనే గొప్ప ప్రజా స్వామ్య దేశమని కొనియాడారు. దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించిన తర్వాత ప్రదాన మంత్రిని ఎన్నుకొనే సమయములో మహాత్మా గాంధీ గొప్ప తప్పిదం చేశారని ఎక్కువ మంది ఉద్యమకారులు . ప్రజలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధాన మంత్రి కావటము ఖాయం అని ఆశించారని కానీ మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ నీ తెరపైకి తెచ్చి ప్రధాన మంత్రిని చేయటము ఘోర తప్పిదం అని. ..ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ప్రధాన మంత్రిని చేసి ఉన్నట్లయితే …ఈ రోజున భారత దేశం ప్రపంచానికీ విశ్వగురువుగా ఉండి అభివృద్ధి పదములోముందుకెళ్ళి ప్రపంచ పటములోభారత్ ముందు వరుసలో ఉండేదని …..పటేల్ ప్రధాన మంత్రి గా ఉంటే కాశ్మీర్ లో మారణ హోమం జరిగి ఉండేది కాదని…. అమాయక హిందూ ప్రజలు ప్రాణాలు కోల్పోయే వారు కాదని అభిప్రాయపడ్డారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పుడో భారత్ అధీనము లోకి వచ్చి ఉండేదని….లౌకిక వాదం పేరుతో మన మనదేశములోని కుహనా లౌకిక వాద పార్టీలు వోట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడి మైనారిటీ ప్రజల ను బుజ్జగిస్తూ మెజారిటీ ప్రజల ప్రయోజనాలను దెబ్బ తీశారని ….భారత దేశాన్ని ఎక్కువ కాలం కాంగ్రెసు పార్టీ పరిపాలించడం మూలంగానే ఇంకా ఆనేక మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారనితెలుపుతూ ….నరేంద్ర మోడీ జీ ప్రధాన మంత్రి అయ్యిన తరువాత నే దేశములో పేదరికము తగ్గింది అని…. మన విదేశాంగ విధానం మూలంగా ప్రపంచ దేశాలలో భారత దేశానికి …..నరేంద్ర మోడీజీకి మంచి గుర్తింపు వచ్చిందిఅని ….ఈ రోజున ప్రపంచము మొత్తము భారత్ వెైపు నరేంద్ర మోడీ జీ వెైపు చూస్తున్నాయి.. అంటే మన విదేశాంగ విధానమే కారణమనితెలిపారు. మన దేశములోని ప్రతి కుహనా లౌకిక వాది మహాత్మా గాంధీ గారిని చంపిందెవరు అని అంటే గాడ్సే అని గట్టిగా చెబుతారు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారికి విషము
పెట్టి చంపింది ఎవరు అంటే మౌనమే సమాధానం వస్తుంది … అని..ఎందుకని యోగ య్యయాదవ్ ప్రశ్నించారు. ఏది ఏమైనా గానీ దేశ స్వాతంత్ర్యము కోసము ముందుండి ఉద్యమాన్ని నడిపిన మహాత్మా గాంధీ గారికి ఘనముగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమములో బిజెపి ఒంగోలు అసెంబ్లీ కో కన్వీనర్ I. సీతా రామయ్య, మండల అధ్యక్షులు శ్రీ గుర్రం రంగనాథ్, గుఱ్ఱం సత్యనారాయణ, తిరుమల, శిరీష్ ,పెట్లురి ప్రసాదరావు, రమేష్, ఎన్. శ్రీని వాస్ , కృష్ణ, కె. శ్రీనివాస్, శివ తదితరులు పాల్గొన్నారు .
