బ్యాంకుల సహకారంతో రైతన్నల మరింత అభివృద్ధి చెందవచ్చని మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. తూర్పుగంగవరం, నాగంబొట్ల పాలెం రైతు సేవా కేంద్రాల పరధిలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మెనేజర్ సీహెచ్ మహేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే ప్రభుత్వ రాయితీలు వర్తిస్తాయని తెలిపారు. పంట రుణాలు 900 మంది రైతులకు రూ.15కోట్లకు పైగా మంజూరు చేసినట్లు చెప్పారు. పశువుల రుణాలకు 60 పైసలు వడ్డీ అని, 4 ఎకరాల పొలం ఉన్న రైతులకు తాకట్టు లేకుండా రూపాయి వడ్డీతో రూ. 8లక్షల రుణం మంజూరు చేయటం జరుగుతుందని చెప్పారు. మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ … ఖరీఫ్ పంటల నమోదుకు సూపర్ చెక్ 9వ తేదీతో ముగిసిందని తెలిపారు. రైతులు వరి నారు కొసలు త్రుంచి నాటుకోవాలని చెప్పారు. యార్డ్ అసిస్టెంట్ శ్రీనివాస రావు. వి హెచ్ ఏలు మౌలా మస్తాన్ ఖాన్, కాటం రాజు, వి ఏ ఏలు డి వి సుమ, అమృత వర్షిణి, తదితరులు పాల్గొన్నారు.

