గ్రామ పంచాయితీకి ఆదాయపు వనరుల గుర్తింపులో మంచి బాగస్వామ్యులు కావాలని వక్తలు కోరారు. ఎంపీడీఓ కార్యాలయం సమావేశపు మందిరంలో రెండు రోజుల నుండి జరుగుతున్న శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది. ఎంపీడీఓ సానికొమ్ము సత్యం, ఈఓపీఆర్డీ సుందర రామయ్యలు మాట్లాడుతూ… పంచాయితీలలో భవనాల ప్లాన్ మంజూరు, లే అవుట్ల మంజూరుకు పాటించాల్సిన జాగ్రత్తలు, పంచాయితీలకు వచ్చే అదనపు ఆదాయం గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ పునః రుచ్చరణ తరగతులలో నేర్చుకున్న విషయాలను అమలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతి వార్డు మెంబర్ పై ఉందని వివరించారు. గ్రామ కార్యదర్శి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
