రైతులకు వెంటనే సహాయం అందించాలి – ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కైపు వెంకట కృష్ణా రెడ్డి

ప్రకాశం జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతుల జీవితాల్లో పెను కష్టాలు మిగిలించాయని ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కైపు వెంకట కృష్ణా రెడ్డి అన్నారు . వర్షాలతో పంటలు నాశనం అవ్వడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని .. ముఖ్యంగా వరి, పత్తి, మిరప, టమోటా వంటి విలువైన పంటలు దెబ్బతిన్నాయ ని తెలిపారు . ఈ వర్షాలు కేవలం పంటలకు మాత్రమే కాకుండా, ప్రజల జీవితాలకు కూడా దెబ్బతీశాయ ని అన్నారు . గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయ కార్మికులు తమ భవిష్యత్తుపై తీవ్రమైన ఆందోళన చెందుతున్నట్లు ఆందోళన చెందారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అకస్మాత్తుగా వచ్చిన ఈ వర్షాలు వలన పంటలను నేలమట్టం అయి , రైతుల పొలాల్లోని పంటలు మొత్తం కోల్పోయే పరిస్థితి వచ్చిందని , అలాగే రహదారులు కూడా భారీగా దెబ్బతిన్నాయని … వర్షపు నీటితో రహదారులు పూర్తిగా నాశనం కావడం వల్ల, ప్రజలు రవాణా పై తీవ్ర మైన ప్రభావం చూపు తుందని అన్నారు . ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని … పాడైన రోడ్ల వల్ల ప్రజలకు సకాలంలో సహాయం అందించడం కష్టంగా మారింద ని అన్నారు .

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంద ని అన్నారు . పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేసారు . రైతులకు భరోసా కలిగించేందుకు ప్రత్యేక ఆర్థిక సహాయం కల్పించాలని కోరారు . అలాగే రోడ్లను సత్వరంగా మరమ్మతు చేయించి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేసారు .

ఈ ప్రకృతి వైపరీత్యాలు రైతులపైనే కాదు, సర్వ సాధారణ ప్రజలపైన కూడా తీవ్ర ప్రభావం చూపాయని అన్నారు . ప్రతి కుటుంబం ఈ కష్టకాలంలో నష్టపోయిందని , ప్రభుత్వం ఈ విపత్తును పట్టించుకుని వెంటనే సహాయ చర్యలు ప్రారంభించాలని, పేద ప్రజలు, రైతులు కష్టాలు పడకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంద ని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *